Header Banner

ఇల్లు కొనడం... లేదా రెంట్‌కి ఉండటం... రెండిటిలో ఏది బెటర్?

  Mon Feb 03, 2025 20:59        Business

తాజా బడ్జెట్‌ మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించింది. చాలా వరకు పన్ను భారం తీర్చింది. ఈ సమయంలో చాలా మంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ప్లాన్‌ చేస్తుండవచ్చు. మరోవైపు ఇంటిని కొనడం మంచిదా లేక రెంట్‌ ఇంట్లో ఉండటం మంచిదా? అని ఆలోచిస్తుండవచ్చు. ఈ విషయంలో తీసుకునే నిర్ణయం ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంటిని కొనడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలి. ప్రాపర్టీ ధరలు భారీగా ఉండటంతో, రెంట్‌కి తీసుకోవడమే మంచది అనుకోవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో, లాభ, నష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 

 

ప్రాపర్టీని కొనుగోలు చేసినప్పుడు, పాత పన్ను విధానంలో పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. హోమ్ లోన్ EMIలోని ప్రిన్సిపల్‌ అమౌంట్‌, ఇంట్రెస్ట్‌ పేమెంట్‌పై పన్ను మినహాయింపులు పొందవచ్చు. ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి ఖర్చులు సహా సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ఇంట్లో స్వయంగా ఉంటన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే, గృహయజమానులు హోల్‌ లోన్‌ వడ్డీపై సంవత్సరానికి రూ.2 లక్షల వరకు డిడక్షన్‌ పొందవచ్చు.

 

మీరే ఇంట్లో ఉంటే, ఎలాంటి అద్దె ఆదాయం రాకపోతే, హోమ్‌ లోన్‌ వడ్డీని నష్టంగా పరిగణించవచ్చు. ఈ నష్టాన్ని (రూ.2 లక్షల వరకు) ఇతర ఆదాయంతో అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. నష్టం ఈ పరిమితిని మించి ఉంటే, దానిని ఎనిమిదేళ్ల వరకు క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు. ఒక వ్యక్తి మూడు లేదా అంతకంటే ఎక్కువ ప్రాపర్టీలు కలిగి ఉంటే, పన్ను చట్టాలు కేవలం రెండు ఆస్తులను మాత్రమే సెల్ఫ్‌-ఆక్యుపైడ్‌గా పరిగణిస్తాయి. మిగిలిన వాటికి ఎస్టిమేటెడ్‌ మార్కెట్ రెంట్‌ ఆధారంగా పన్ను విధిస్తారు. 

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అసెట్ బిల్డింగ్: ప్రతి నెలా చెల్లించే ఈఎంఐలు మీకు ప్రాపర్టీని సంపాదించి పెడతాయి.

స్థిరత్వం: శాశ్వతంగా ఒకే ఇంట్లో ఉండవచ్చు. అకస్మాత్తుగా ఖాళీ చేయాలనే సమస్యలు ఉండవు.

ప్రతికూలతలు

భారీ ఖర్చులు: హోమ్‌ లోన్‌ తీసుకునే ముందు పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆస్తి పన్నులు వంటివి కూడా భరించాలి.

నిరర్థక ఆస్తులు: ఏదైనా అత్యవసరం ఎదురై ఇంటిని త్వరగా విక్రయించాలనుకుంటే సాధ్యం కాదు.

మార్కెట్ ప్రమాదాలు: ప్రాపర్టీ వ్యాల్యూ ఎల్లప్పుడూ పెరగకపోవచ్చు.

ఈఎంఐ కమిట్‌మెంట్‌: నెలవారీ ఈఎంఐ చెల్లింపులు క్రమం తప్పకుండా చేయాలి. ఇది ఆర్థిక భారం కావచ్చు. 

 

ఇంటిని అద్దెకు తీసుకుంటే ప్రయోజనాలు
ట్యాక్స్‌ బెనిఫిట్‌: ఉద్యోగులు హౌస్‌ రెంట్‌ అలవెన్స్ పై ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ పొందవచ్చు. సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ ఇండివిడ్యువల్స్‌ అయితే పాత పన్ను విధానంలో ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి నెలకు రూ.5,000 వరకు డిడక్ట్‌ చేయవచ్చు.

నెలవారీ ఖర్చులు: సాధారణంగా ప్రతినెలా హోమ్‌ లోన్‌ ఈఎంఐకి చెల్లించే డబ్బు కంటే, ఇంటి అద్దె తక్కువగానే ఉంటుంది.

ఫ్లెక్సిబిలిటీ: మీరు పని చేసే చోటు లేదా జీవనశైలి అవసరాల ఆధారంగా అవసరమైనప్పుడు ఇల్లు మారవచ్చు.

మెయింటెనెన్స్‌ కాస్ట్‌: మీకు ఎలాంటి మెయింటెనెన్స్‌ ఖర్చులు ఉండవు. ఇంటి యజమానికి వాటి బాధ్యత ఉంటుంది. 

 

ప్రతికూలతలు 
ఓనర్‌షిప్‌: అద్దె చెల్లింపులు మీకు ఆస్తిని సంపాదించి పెట్టవు.

వార్షిక అద్దె పెంపు: నెలవారీ అద్దె కాలక్రమేణా పెరుగుతుంది. దీంతోపాటు ఖర్చులు పెరుగుతాయి.

కస్టమైజేషన్‌ ఇబ్బందులు: అద్దెదారులు ఇంటికి అవసరమైన మార్పులు చేయలేరు. ఉన్నదాన్నే జాగ్రత్తగా వినియోగించుకోవాలి.

స్థిరత్వం లేకపోవడం: అద్దెదారుని తక్కువ సమయంలోనే ఇంటిని ఖాళీ చేయమని యజమాని అడగవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #HomeLoan #InterestRates #BankLoans #LowInterest